కేశవరం పంచాయతీకి అభివృద్ధి జోరు..

  • సంక్షేమానికి పెద్దపీట
    రూ.8.70 కోట్లతో అభివృద్ధి, -సంక్షేమ కార్యక్రమాలు
    కూటమి నేతలు సమన్వయంతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

  • ప్రజా వీక్షణం, కోట (సెప్టెంబర్ 1): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు. కేశవరం పంచాయతీ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు దాదాపు రూ.8.70 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.కోట మండలం కేశవరం పంచాయతీ పరిధిలోని రాఘువాపురం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో ప్రతి నెలా 570 మంది లబ్ధిదారులకు రూ.22.80 లక్షల పింఛన్ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.అన్నదాత సుఖీభవ పథకం కింద 397 మంది రైతులకు రూ.1.71 కోట్లు, తల్లికి వందనం ద్వారా 543 మంది విద్యార్థులకు రూ.81.40 లక్షల సాయం అందిస్తున్నట్లు వివరించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, రూ.30 లక్షలతో ఇరిగేషన్ పనులు, రూ.28 లక్షలతో మంచినీటి పైప్‌లైన్, వాటర్ ప్లాంట్, రూ.5 లక్షలతో నూతన బోర్‌వెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.27 లక్షలతో దేవాలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. వెలుగు పథకం ద్వారా మహిళా సంఘాలకు రూ.5.39 కోట్ల మేర రుణాలు అందించినట్లు పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో, సమిష్టిగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసులు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమీలమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పలాగాటి భాస్కర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్, బీజేపీ మండల అధ్యక్షులు హరిబాబు, జనసేన మండల అధ్యక్షులు మధు, తిరుములశెట్టి కోటేశ్వరరావు, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
error: Content is protected !!
Prajaveek Shanam