గూడూరు ప్రజా వీక్షణం సెప్టెంబర్ 01
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గూడూరు జనసేన నాయకులు పేటేటి చంద్రనీల్ ఆధ్వర్యంలో ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులు, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని యువత సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయమని చంద్రనీల్ పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్య బృందం, వాలంటీర్లు, రక్తదాతలకు ఆయనతో పాటు యూనివర్సిటీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చైతన్య, సూర్య, శివ, విష్ణు, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.












