గూడూరు: ప్రజా వీక్షణం సెప్టెంబర్ 01
గూడూరులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రధానాచార్యులుగా గత మూడు సంవత్సరాలుగా విశేష సేవలందించిన వి. రంగనాయకులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ప్రధానాచార్యురాలిగా రోహిణి బాధ్యతలు స్వీకరించారు.పాఠశాల కార్యదర్శి డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్, కమిటీ సభ్యులు సనత్ కుమార్, రామమోహన్, ఆర్.వి. రావు, అశోక్ కుమార్, రవిచంద్రల ఆధ్వర్యంలో రంగనాయకులు, ఆయన సతీమణి లక్ష్మీనరసమ్మలను ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి రంగనాయకులు అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.












