12 సినిమాలు.. హిట్లు మాత్రం ఒకట్రెండు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి): సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. కొందరు తక్కువ సినిమాలతోనే స్టార్‌డమ్ అందుకుంటే.. మరికొందరు వరుస అవకాశాలు దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతారు. అలాంటి హీరోయిన్లలో బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్ ఒకరు. దాదాపు 12 సినిమాల్లో నటించినా.. చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం ఆమె ఖాతాలో తక్కువగానే ఉన్నాయి.
‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ ఎంట్రీ..
శర్వానంద్ హీరోగా నటించిన ‘రన్ రాజా రన్’ సినిమాతో సీరత్ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. 2015లో సందీప్ కిషన్ నటించిన ‘టైగర్’లో నటించడంతో పాటు ‘కొలంబస్’, ‘రాజు గారి గది 2’, ‘టచ్ చేసి చూడు’, ‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లోనూ కనిపించింది.
వరుస సినిమాలు.. విజయాలు మాత్రం దూరం
సీరత్ కపూర్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ప్రత్యేక పాటల్లోనూ మెరిసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఆమె.. నటనపై ఆసక్తితో హీరోయిన్‌గా మారింది. హిందీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించినా కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.
సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్..
సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత సీరత్ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతూ.. మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

error: Content is protected !!
Prajaveek Shanam