కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్

నెల్లూరు జిల్లా ఐఆర్‌సీఎస్ సేవలకు అరుదైన గుర్తింపు

నెల్లూరు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) నెల్లూరు జిల్లా శాఖ అందిస్తున్న విశేష సేవలు, సాధించిన ప్రగతికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్‌ను అందజేశారు.
సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.నెల్లూరు జిల్లా ఐఆర్‌సీఎస్ శాఖలో 2,097 మంది లైఫ్ మెంబర్లను నమోదు చేయడంతో పాటు, వివిధ రక్తదాన శిబిరాల ద్వారా 15,747 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అందుబాటులో ఉంచడంలో జిల్లా శాఖ కీలకంగా సేవలందించింది.రక్తదాన కార్యక్రమాల విస్తరణ, లైఫ్ మెంబర్ల నమోదు తదితర సేవా కార్యక్రమాల్లో జిల్లా శాఖ సాధించిన ప్రగతికి గవర్నర్ గోల్డ్ మెడల్ లభించడంపై జిల్లా అధికారులు, ఐఆర్‌సీఎస్ సభ్యులు, వాలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam