కోహ్లీని చూసి థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫిదా!

లండన్, సెప్టెంబర్‌ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చారిత్రక లార్డ్స్ మైదానంలో కోహ్లీని చూసిన ఓ థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్పందన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. థాయ్ స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ నాంజీ.. క్రికెట్‌లో కోహ్లీనే మెస్సీ, రొనాల్డో అంటూ పోల్చడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా జూన్‌లో నాంజీ లార్డ్స్ మైదానానికి వెళ్లింది. అక్కడ అనూహ్యంగా విరాట్ కోహ్లీతో పాటు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను చూసింది. ఆ సమయంలో తీసిన వీడియో తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు దాదాపు పది లక్షలకు చేరువలో వీక్షణలు రావడం విశేషం.
కోహ్లీని చూసిన వెంటనే నాంజీ ఉత్సాహంతో స్పందించింది. క్రికెట్‌లో కోహ్లీ మెస్సీ, రొనాల్డోలాంటి దిగ్గజమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అనుసరించే క్రీడాకారుల్లో కోహ్లీ ఒకరని, సామాజిక మాధ్యమాల్లో ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిపింది.
క్రికెటర్లను కేవలం ఆటగాళ్లుగా కాకుండా ఫిట్‌నెస్, జీవనశైలి ప్రతీకలుగా మార్చడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించారని నాంజీ ప్రశంసించింది. లార్డ్స్ మైదానంలో భారత క్రికెట్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూస్తానని ఊహించలేదని, భారత మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లకు మద్దతుగా క్రికెట్‌లోని అతిపెద్ద దిగ్గజాల్లో ఒకరు రావడం అద్భుతంగా అనిపించిందని తన అనుభూతిని పంచుకుంది.

error: Content is protected !!
Prajaveek Shanam