
గూడూరు: ప్రజా వీక్షణం సెప్టెంబర్ 01
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా గూడూరు అర్బన్ మండల బీజేపీ సమావేశం మండల అధ్యక్షుడు కే. దయాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్లో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత అంశాలపై నాయకులు చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.కార్యక్రమంలో గూడూరు మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు, పెద్ద శివాలయం కమిటీ చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, జిల్లా బీజేపీ మహిళా నేత బిందు రెడ్డి, మండల కమిటీ సభ్యులు, వివిధ మోర్చాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.












