
నరసరావుపేట, సెప్టెంబర్ 2 (ప్రజా వీక్షణం గురు ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఎస్ఆర్కే సెంటర్ వద్ద భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు డప్పులు, డీజేలు, నినాదాలతో ప్రాంతాన్ని హోరెత్తించారు. మంత్రి రాక సందర్భంగా కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ ఘనంగా ఆహ్వానించారు. పసుపు జెండాలతో పట్టణం మొత్తం సందడిగా మారింది. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారా లోకేష్‌కు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాయకుల రాకతో ఎస్ఆర్కే సెంటర్ పరిసర ప్రాంతాలు జనసందోహంగా మారాయి.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, భాష్యం రామకృష్ణ మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జాన్ సైదా, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తల ఉత్సాహం నాయకులను ఆకట్టుకుంది. దర్శి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని, టీడీపీ సీనియర్ నాయకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మన్నవ మోహన కృష్ణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కనుమూరి బాజి చౌదరి, కనపర్తి శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి లోకేష్ రాక సందర్భంగా పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లు కనిపించాయి. నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్‌కు లభించిన స్వాగతం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. పార్టీ విజయాల కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు మంత్రి లోకేష్‌తో కలిసి ఫోటోలు దిగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.













