- బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడికి ఆత్మీయ పరామర్శ
- ఒక్కసారి కలవాలన్న ఆకాంక్షను నెరవేర్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత
- మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చొరవతో జరిగిన భేటీ
- ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చిన జగన్
కర్నూలు, సెప్టెంబర్ 3 (ప్రజా వీక్షణం ప్రతినిధి): బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన వీరాభిమాని కోరికను వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. కర్నూలుకు చెందిన విశ్వనాథ్ గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ చికిత్స పొందుతున్నాడు. వైయస్ జగన్‌కు వీరాభిమాని అయిన అతడు జీవితంలో ఒక్కసారైనా తన అభిమాన నాయకుడిని కలవాలని, ఆయనతో ఫొటో దిగాలని ఎంతోకాలంగా కోరుకుంటున్నాడు. ఈ విషయం పార్టీ నాయకుల ద్వారా జగన్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా విశ్వనాథ్‌ను వైయస్ జగన్‌ను కలిసేలా ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చొరవ తీసుకుని విశ్వనాథ్‌ను జగన్ వద్దకు తీసుకెళ్లారు. తన అభిమాన నాయకుడిని ప్రత్యక్షంగా చూసిన విశ్వనాథ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఎంతోకాలంగా మనసులో పెట్టుకున్న కోరిక నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశాడు.
విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైయస్ జగన్ ఆరా తీశారు. అతనితో కొంతసేపు ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. వ్యాధితో పోరాడుతూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, ధైర్యంగా చికిత్స కొనసాగించాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌తో కలిసి జగన్ ఫొటో దిగారు. తన అభిమాన నాయకుడితో కలిసి ఫొటో దిగిన క్షణాన్ని విశ్వనాథ్ జీవితంలో మరచిపోలేని అనుభూతిగా అభివర్ణించాడు. కుటుంబ సభ్యులు కూడా జగన్ చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన అక్కడున్న వారిని కూడా భావోద్వేగానికి గురిచేసింది.
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానిని ప్రత్యేకంగా కలుసుకుని పరామర్శించడం జగన్ మానవీయ కోణాన్ని ప్రతిబింబిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పట్ల, అభిమానుల పట్ల ఆయన ఎప్పుడూ సానుభూతితో వ్యవహరిస్తారని అన్నారు. విశ్వనాథ్‌కు ఇచ్చిన ధైర్యం అతనిలో కొత్త ఆశలు నింపిందని అభిప్రాయపడ్డారు. తన జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు ఇదేనని విశ్వనాథ్ పేర్కొన్నాడు. వైయస్ జగన్‌ను కలవాలన్న తన కోరిక నెరవేరడంతో ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ జగన్ అందించిన భరోసా జీవితాంతం గుర్తుండిపోతుందని తెలిపాడు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












