గూడూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

గూడూరు, సెప్టెంబర్ 3: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గూడూరు పట్టణంలోని పటేల్ వీధి శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో సెప్టెంబర్ 4న ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఉపపీఠాధిపతి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ కోటా సునీల్ కుమార్ స్వామి తెలిపారు. అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో బాలకృష్ణుడికి పాలాభిషేకం చేసి, నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వెన్న, మీగడ, అటుకులు, మురుకులు, లడ్డూలు తదితరాలను నైవేద్యంగా సమర్పించనున్నట్లు తెలిపారు.కృష్ణాష్టమి సందర్భంగా ఇళ్ల ముంగిట ముగ్గులు వేసి, వాకిలి నుంచి పూజా గది వరకు బాలకృష్ణుడి పాదముద్రలను ఏర్పాటు చేసి పూజలు చేయాలని సూచించారు. వీధుల్లో యువత ఉత్సాహంగా పాల్గొనే ‘ఉట్టి కొట్టే’ వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.శ్రీకృష్ణుడికి 56 రకాల వంటకాలతో సమర్పించే ‘ఛప్పన్ భోగ్’ మహా నైవేద్యానికి ప్రత్యేకత ఉందని కోటా సునీల్ కుమార్ స్వామి తెలిపారు. గోవర్ధన గిరిని ఏడు రోజుల పాటు ఎత్తి బ్రజవాసులను కాపాడిన సమయంలో కృష్ణుడు భోజనం చేయలేదనే పురాణ కథనం ఆధారంగా 56 రకాల నైవేద్యాల సంప్రదాయం ఏర్పడిందని వివరించారు. లడ్డూలు, పేడాలు, జిలేబీ, వెన్న–మిశ్రీ, పాలు, పెరుగు, పాయసం, పూరీలు, అన్నం, పప్పు, పండ్లు, డ్రైఫ్రూట్స్ తదితరాలను నైవేద్యంగా సమర్పిస్తారని చెప్పారు.ఇంట్లో 56 రకాల వంటకాలు తయారు చేయడం సాధ్యం కాకపోయినా భక్తితో సమర్పించే నైవేద్యమే ముఖ్యమని, స్వచ్ఛమైన మనసుతో సమర్పించే తులసి దళం కూడా భగవంతుడికి ప్రీతికరమేనని కోటా సునీల్ కుమార్ స్వామి పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam