
గూడూరు: గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో టీడీపీ పార్టీ కార్యకర్త శ్రీ కడివేటి మస్తాన్, శ్రీమతి శాంతి దంపతుల కుమార్తె వివాహ నలుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.












