కూటమి రెండేళ్ల పాలనపై ఇంటింటి ప్రచారం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో డోర్‌టూ డోర్‌ ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు మండలం తిమ్మనగారిపాలెం గ్రామంలో శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్‌కుమార్‌ పెంచలకోన ట్రస్ట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ తానంకి నానాజీతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి వివరించడమే ఈ ప్రచారం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam