గూడూరు: పేపళ్ల అమరయ్య నాయుడు
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు గూడూరు పట్టణం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యుడు పేపళ్ల అమరయ్య నాయుడు తెలిపారు.హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం లేదా పూజ ప్రారంభించినా తొలుత వినాయకుడిని పూజించడం ఆనవాయితీ అని ఆయన పేర్కొన్నారు. అలాంటి విఘ్నేశ్వరుడి పర్వదినమైన వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.గూడూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాలు, వీధుల్లో భక్తులు ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నందుకు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అమరయ్య నాయుడు కోరారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.












