వివాహేతర సంబంధం.. పెళ్లికి నిరాకరణతో బెదిరింపులు.. పరువు పోతుందనే భయంతో ప్రియుడి ఘాతుకంహనుమకొండ: ప్రేమ పేరుతో ఏర్పడిన పరిచయం చివరకు దారుణ హత్యకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను బళ్లారికి పిలిపించిన వ్యక్తి.. ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికిన ఘటన సంచలనం సృష్టించింది.హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన స్వప్న(40) భర్త మృతి చెందడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. గతంలో తల్లిదండ్రులతో కలిసి పూజ కార్యక్రమం కోసం బళ్లారికి వెళ్లిన సమయంలో డ్రైవర్ బసవరాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ పరిచయం అనంతరం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు సమాచారం. కొంతకాలానికి తనను పెళ్లి చేసుకోవాలని స్వప్న బసవరాజ్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లికి అతడు నిరాకరించడంతో.. తమకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెడతానని ఆమె బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.దీంతో తన పరువు పోతుందనే భయంతో స్వప్నను హత్య చేయాలని బసవరాజ్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మే 15న స్వప్నను బళ్లారికి రమ్మని పిలిచినట్లు పోలీసులు తెలిపారు.బళ్లారిలోని సిద్ధేశ్వర ఆలయం వద్ద ఆమెను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆమె మొబైల్ ఫోన్‌ను చెరువులో పడేసి, దుస్తులను తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు.మరోవైపు స్వప్న కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు మే 31న పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కాల్ డేటా, మొబైల్ లొకేషన్ ఆధారంగా బసవరాజ్‌పై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో స్వప్నను తానే హత్య చేసినట్లు బసవరాజ్ అంగీకరించినట్లు సమాచారం.దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజా వీక్షణం












