టీడీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా గణపతి మట్టి విగ్రహ ప్రతిష్ఠాపన

నెల్లూరు: వినాయక చవితి సందర్భంగా నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గణపతి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఏడాది జిల్లా టీడీపీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అనుకున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్‌, కూటమి ప్రభుత్వానికి గణపతి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పార్టీ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి జిల్లా సస్యశ్యామలంగా మారాలని, రాష్ట్రం, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా విజయవంతంగా ముందుకు సాగాలని గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెన్ని రవణయ్య, మామిడాల మధు, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, ఊరందూరు సురేంద్రబాబు, సాబీర్ ఖాన్, జలదంకి సుధాకర్, ఓం ప్రకాష్, అమృల్లా, పాల్‌శెట్టి, జ్ఞానేంద్ర, దోర్నాల హరిబాబు, ఆశం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam