ప్రజా వీక్షణం అమరావతి, సెప్టెంబర్ 14:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు 15వ తేదీ ఉదయం 4 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తిరుమలకు చేరుకుంటారు. ఉదయం 5.30 గంటలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఉదయం 7.40 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.ఉదయం 7.55 గంటల నుంచి 9.15 గంటల వరకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత తిరుమలలోని శ్రీ గాయత్రీ నిలయంలో ఆయనే బజ చేయనున్నారు.ఉదయం 8.40 గంటలకు తిరుమలలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభూతి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9.15 గంటలకు ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ వాహన బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.ఆ తర్వాత ఉదయం 9.35 గంటలకు తిరుమలలో ఏర్పాటు చేసిన శ్రీవారి ప్రత్యేక మ్యూజియంను ప్రారంభిస్తారు. ఉదయం 10.25 నుంచి 11.25 గంటల వరకు శ్రీవారి విశ్రాంతి గృహంలో పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు తిరుమల నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు ఉండవల్లికి చేరుకోనున్నారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రత, దర్శన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేపడుతున్నారు.












