గూడూరులో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాశిం సునిల్ కుమార్

గూడూరు పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునిల్ కుమార్ పలు ప్రాంతాల్లో స్థానికులు, యువత ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు.అశోక్ నగర్, తూర్పు వీధి, కేవీ హాస్పిటల్ ప్రాంతం, గూడూరు 2వ పట్టణం కోర్ట్ సెంటర్, రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఆయా మండపాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు, స్థానికులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే.. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.కోర్ట్ సెంటర్ ప్రాంతంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో స్థానికులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam