తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా మర్యాదపూర్వక భేటీ
తిరుపతి, సెప్టెంబర్ 15, ప్రజా వీక్షణం:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గూడూరు శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురి మధ్య సౌహార్దపూర్వకంగా చర్చ జరిగినట్లు సమాచారం.శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సునీల్‌కుమార్ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమల పర్యటనకు బయలుదేరారు.












