తిరుపతిలో డివిజన్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

50 నుంచి 66కు పెరిగిన డివిజన్లు

తిరుపతి, సెప్టెంబర్ 15: ప్రజా వీక్షణం
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66 డివిజన్లకు పెంచేందుకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.నగర విస్తరణ, జనాభా పెరుగుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని డివిజన్ల పునర్విభజన ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 4న పురపాలక పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గడువు ఇచ్చారు.సెప్టెంబర్ 11 వరకు అందిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన అనంతరం డివిజన్ల పునర్విభజన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం 50 నుంచి 66 డివిజన్లకు పెంపునకు ఆమోదం తెలిపింది.డివిజన్ల సంఖ్య పెరగడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పాలన, ప్రజలకు సేవల అందుబాటు విషయంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొత్త డివిజన్ల ఏర్పాటుతో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూడా మార్గం సుగమం కానుంది.ప్రభుత్వం డివిజన్ల పెంపునకు ఆమోదం తెలిపిన విషయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ మంగళవారం సాయంత్రం వెల్లడించారు.

error: Content is protected !!
Prajaveek Shanam