బాలాయపల్లి, సెప్టెంబర్ 15: ప్రజా వీక్షణం
బాలాయపల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీ) ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు జి. నాగేశ్వరరావు, బీరం ప్రదీప్‌కుమార్ తెలిపారు.సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఎస్‌ఎంసీ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసినట్లు వారు తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది:
– సెప్టెంబర్ 15: ఎస్‌ఎంసీ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.
– సెప్టెంబర్ 18: పాఠశాల నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన.
– సెప్టెంబర్ 25: ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, తుది ఓటర్ల జాబితా ఖరారు.
– సెప్టెంబర్ 29: ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ.
– మధ్యాహ్నం 1.30 గంటలకు: చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక.
– మధ్యాహ్నం 2 గంటలకు: నూతన కమిటీ ప్రమాణ స్వీకారం.
– మధ్యాహ్నం 3 గంటలకు: నూతన ఎస్‌ఎంసీ తొలి సమావేశం.
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలను పాటిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని మండల విద్యాశాఖ అధికారులు సూచించారు.












