నెల్లూరు: MPTC, ZPTC రెండో సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణలో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కలెక్టర్, ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈ నెల 15, 16 తేదీల్లో సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు.ఈ మేరకు 16వ తేదీన MPDO కార్యాలయాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది పోలింగ్ కేంద్రాల జాబితాను 19వ తేదీన ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.












