అమరావతి, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం.అయితే రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కొత్త పెన్షన్ల దరఖాస్తుల గడువును మరికొంతకాలం పొడిగించాలని పలువురు కోరుతున్నారు.దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాగా అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.












