గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో  మోదీ జన్మదిన వేడుకలు

పేదలకు ఉచిత వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం: బీజేపీ పట్టణ అధ్యక్షులు దయాకర్

గూడూరు: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను గూడూరు పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు కే. దయాకర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగుల సమక్షంలో కేక్ కట్ చేసి, అనంతరం రోగులు, సిబ్బందికి కేక్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంస్కరణలు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
బీజేపీ పట్టణ అధ్యక్షులు కే. దయాకర్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, అనంతరం ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ అనేక సంస్కరణలను అమలు చేశారని అన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. పేదలకు ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.బీజేపీ జిల్లా కార్యనిర్వాహక సభ్యులు, గూడూరు పట్టణ శివాలయం దేవస్థానం చైర్మన్ బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆలోచనలు, ఆశయాలు దేశ అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు.
జిల్లా మహిళా మోర్చా నాయకురాలు బిందు మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన చర్యలు చేపట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు పర్చూరు బాలకృష్ణ గౌడ్, ఎం. రవీంద్ర, ఉపాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసులు, పట్టణ కమిటీ కోశాధికారి నిరంజన్, నీలి ధనంజయ, మహిళా మోర్చా అధ్యక్షురాలు బాలామణి, యువ మోర్చా అధ్యక్షులు శివకుమార్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కటికాల సురేష్, సీనియర్ నాయకులు తూపిలి రమేష్, లక్ష్మి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam