చీపురు పట్టిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. స్వచ్ఛతా కార్యక్రమంలో కురుగొండ్ల

వెంకటగిరిలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు

వెంకటగిరి, సెప్టెంబర్ 19: వెంకటగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు.ముందుగా స్థానిక నాయకులు, పురపాలక సిబ్బంది, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం శ్రమదానంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ విభాగాల బాధ్యత కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ పారిశుద్ధ్యం సాధ్యమవుతుందని అన్నారు.ప్రజలు తమ ఇళ్లను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా పరిసర ప్రాంతాలు, వీధులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. రోడ్లపై చెత్త వేయకుండా ఇంట్లోనే చెత్తను సేకరించి, మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడు వాటికి అందించాలని సూచించారు.తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వచ్ఛమైన వెంకటగిరి కోసం ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam