సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
వెంకటగిరి, సెప్టెంబర్ 24:
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు.వెంకటగిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 59 మంది లబ్ధిదారులకు రూ.62,22,388 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా వెంకటగిరి పట్టణానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు రూ.9.17 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు.అత్యవసర వైద్య చికిత్సలు, అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మురుగ, పట్టణ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.












