గూడూరు, సెప్టెంబర్ 26: ప్రజా వీక్షణం
గూడూరు రూరల్ ఐసీడీఎస్ పరిధిలోని తిప్పవరపాడు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్టు సీడీపీఓ మహబూబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులు, బాలింతలకు సమావేశం నిర్వహించి పోషకాహారం, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ కేంద్రాల సేవలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రారంభ బాల్య సంరక్షణ దినోత్సవం (ఈసీసీ డే) నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో అందించే భోజనం, ఇంటి వద్ద పిల్లలకు అందించే ఆహారం, పోషకాహారం ప్రాధాన్యత, చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లులకు వివరించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ మహబూబా సూచించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు చిన్న వయస్సు నుంచే సమతుల్యమైన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమన్నారు.పోషణ ప్రతిజ్ఞ’ కార్యక్రమం నిర్వహించి పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ‘అంగన్వాడీ – మా బాధ్యత’ అనే అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కార్యక్రమాల్లో తల్లిదండ్రులు చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు.ఈ సందర్భంగా సీడీపీఓ మేహబూబ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి, తల్లులందరితో సమావేశం నిర్వహించారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు పిల్లలకు ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు వంటి పోషక పదార్థాలను అందించాలని సూచించారు.పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. పోషకాహార లోపాన్ని గుర్తించి, అవసరమైన వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను అందించాలని సూచించారు.కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ చెంచులక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, తల్లులు, చిన్నారులు, తల్లిదండ్రులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












