గూడూరు, సెప్టెంబర్ 30: ప్రజా వీక్షణం
గూడూరు మండలం తిరువెంగళ్లాయపల్లి అరుంధతివాడలో బుధవారం అంగన్వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా సూపర్వైజర్ చెంచులక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ ఎస్.కె. మహబూబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. తల్లులు పిల్లలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై తల్లులకు అవగాహన కల్పించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలను తల్లులకు వివరించారు. పిల్లల ఎదుగుదలకు పోషకాహారం కీలకమని, అంగన్వాడీ కేంద్రాల సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ, ఆయా ఆశతో పాటు పలువురు తల్లులు పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్, ఆయాను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.












