గూడూరు పట్టణం: పంబలేరు బ్రిడ్జి వద్ద గుంతలమయంగా మారిన రహదారితో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు, కాంట్రాక్టర్ల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్.అధికారులు, కాంట్రాక్టర్లకు రహదారిపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు పూడ్చిన గుంతలను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం బ్రిడ్జి అభివృద్ధి పనులకు మంజూరైన నిధులతో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రహదారి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.












