నెల్లూరు: చిల్లకూరు మండలం ఉడతావారిపాలెం గ్రామానికి చెందిన రెకందర్ భాస్కర్ అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1,76,192 విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరైంది. మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ భాస్కర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా భాస్కర్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.












