నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు

-ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై డీఎస్పీతో చర్చ

గూడూరు:  ప్రజా వీక్షణం  అక్టోబర్-07

గూడూరు డివిజనల్ డీఎస్పీగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరసింహమూర్తిని జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏసుపాకు పెంచలయ్య, గూడూరు డివిజన్ డీవీఎంసీ సభ్యులు రావూరు సురేంద్ర, కోట వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ గూడూరు రూరల్ మండల యువత అధ్యక్షులు శ్రీపాదం ఉదయ్‌కుమార్ డీఎస్పీని కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గూడూరు డివిజన్ పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిస్థితి, బాధితులకు అందాల్సిన పరిహారం (కాంపెన్సేషన్), కేసుల పరిష్కారం తదితర అంశాలపై డీఎస్పీతో వారు చర్చించారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

error: Content is protected !!
Prajaveek Shanam