గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

గూడూరు: ప్రజా వీక్షణం
గూడూరు మండల పరిధిలోని వెడిచర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం సిబ్బంది, గ్రామస్థుల ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు, వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య పరీక్షలు తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
అనంతరం చిన్నారులకు సంబంధించిన పలు కార్యక్రమాలు నిర్వహించి, వారి తల్లిదండ్రులకు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, ANM సుందరమ్మ, అంగన్వాడీ కార్యకర్త హరిత, లక్ష్మి, ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.












