గూడూరు: (ప్రజా వీక్షణం) అక్టోబర్ 08
పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమానికి 15 రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలను అందజేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రగతి అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీ గాయత్రి పాఠశాల యాజమాన్యం ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘లీడర్షిప్’ కాన్సెప్ట్‌లో భాగంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు సామాజిక స్పృహను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యతో పాటు సేవా భావం, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం కూడా విద్యార్థులకు అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి, ఉపాధ్యాయులు నాసిర, మస్తాన్‌బీ, సుప్రజ, రేవంతి, రజిని, పర్వీన్, హరికృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












