టీడీపీలో 50 కుటుంబాల చేరిక

ముత్తుకూరు: ప్రజా వీక్షణం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ముత్తుకూరు పంచాయతీ పరిధిలోని మధురానగర్‌కు చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరులోని వేదాయపాళెంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పలువురు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలవుతున్నాయని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ చారిత్రాత్మక కార్యక్రమంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయగిరి వేదికగా పల్లెపండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని సోమిరెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పల్లెపండుగ నిధులతో పాటు నుడా నిధులను కలిపి సుమారు రూ.18 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.చిన్న పంచాయతీల్లో సైతం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని సోమిరెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో పలు మార్పులు తీసుకురావడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు.టీడీపీలో చేరిన వారిలో బుచ్చంగారి మోహన్, జానకిరామ్, కాటంగారి వెంకటేశ్వర్లు, చించంగారి వెంకటేశ్వర్లు, కొండూరు విష్ణు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మధురానగర్‌కు చెందిన పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam