ఎఫ్. ఎఫ్. ఎస్ యాప్ పై శిక్షణ కార్యక్రమము…

వెంకటగిరి, అక్టోబర్ 8

వెంకటగిరి సబ్ డివిజన్ పరిధిలో గల వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలము నందు గల రీటైల్ ఎరువుల షాపుల యజమానులు,రైతు సేవా కేంద్రముల పరిధిలో గల గ్రామ వ్యవసాయ సహాయకులకు కేంద్ర ప్రభుత్వము తీసుకువచ్చిన కొత్త ఎఫ్. ఎఫ్. ఎస్ యాప్ పై గురువారం అవగాహనా కార్యక్రమం జరిగింది. రైతులు, తమ పంటలకు కావలసిన ఎరువులను సులభముగా బుకింగ్ చేసుకునే విధానమును గురించి వ్యవసాయ శాఖకు సంబంధించిన సహాయ వ్యవసాయ సంచాలకులు, వెంకటగిరి డాక్టర్ పి.అనసూయ క్షుణ్ణంగా వివరించడము జరిగినది.దీనికి సంబంధించి రైతులు తమ మొబైల్ లో ఎరువులను ఎలా బుకింగ్ చేసుకోవాలనేది వివరముగా తెలపడము జరిగినది. అంతే కాకుండా రైతులు తమ మొబైల్ యాప్ ద్వారా స్థానిక ఎరువుల డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న ఎరువులను అనుసరించి బుకింగ్ చేసిన పిదప క్యూ -ఆర్ కోడ్ రావడము జరుగుతుంది. తద్వారా క్యూ -ఆర్ కోడ్ ను అనుసరించి రీటైల్ డీలర్ల వద్ద అన్ని రకముల ఎరువులను తమ తమ పొలాల విస్తీర్ణం అనుసరించి ఎరువులు పొందడానికి చాలా అనువుగా ఉంటుందని తెలపడము జరిగినది.
ఈ శిక్షణా కార్యక్రమము నందు మండల వ్యవసాయ అధికారులు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి కి సంబంధించిన జి . ప్రవీణ, పి . సుజాత, పి.శిరీష, టీ . విజయలక్ష్మి. ఈ కార్యక్రమం లో పి. ఏ. సి. ఎస్ సి. ఏ. వో లు , ప్రైవేట్ డీలర్లు మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొనడం జరిగినది.

error: Content is protected !!
Prajaveek Shanam