అంగన్‌వాడీ ఆయాలకు ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంపై శిక్షణ

గూడూరులో 260 మంది అంగన్‌వాడీ ఆయాలకు అవగాహన కార్యక్రమం

గూడూరు, ప్రజా వీక్షణం

అంగన్‌వాడీ కేంద్రాల్లో వంట పనులను సులభతరం చేయడంతో పాటు, ఇండక్షన్ స్టవ్‌లను సక్రమంగా వినియోగించే విధానాలపై గూడూరులో అంగన్‌వాడీ ఆయాలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ గూడూరు రూరల్, అర్బన్ ప్రాజెక్టుల పరిధిలోని సుమారు 260 మంది అంగన్‌వాడీ ఆయాలకు ఈ శిక్షణ ఇచ్చారు.ప్రాజెక్టు సీడీపీఓ మెహబూబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ స్టవ్‌ల వినియోగం, వాటి పనితీరు, వంట చేసే విధానం తదితర అంశాలపై ఆయాలకు అవగాహన కల్పించారు. ఇండక్షన్ స్టవ్‌లను ఎలా ఉపయోగించాలి, వంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ద్వారా వంటను సులభంగా ఎలా చేసుకోవచ్చనే విషయాలను వివరించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహార తయారీ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, అందుబాటులోకి వచ్చిన పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆయాలకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. శిక్షణలో భాగంగా ఆయాలకు ఇండక్షన్ స్టవ్‌ల వినియోగంపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బంది, అంగన్‌వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam