ఓటు చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

శాంతియుత నిరసన చేస్తున్న వామపక్ష, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టుపై సీపీఐ నేత సీవీఆర్ కుమార్ ఆగ్రహం

గూడూరు న్యూస్: ప్రజా వీక్షణం ప్రతి నిధి

భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ సీనియర్ నాయకులు సీవీఆర్ కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓటు చోరీ అంశంపై సీజేపీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపడుతుండగా వారిని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా సీవీఆర్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓటు చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులను అరెస్టు చేయడం సరికాదన్నారు.రాత్రికి రాత్రే పోలీసులు సీపీఐ, ఇతర వామపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలంతా ఐక్యంగా నిలిచి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని సీవీఆర్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కన్వీనర్ యాదాల సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సీవీఎల్, మస్తాన్, మహీర్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam