గూడూరు: గూడూరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కె. వెంకట్రావు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. గూడూరు రూరల్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.












