ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పణ.. చిన్నారులకు మిఠాయిల పంపిణీ

విద్యానగర్, నవంబరు 1: ప్రజా వీక్షణం
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 52 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామంలోని విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు పేరిట ఏర్పాటు చేసిన ఎం.వి. రావు ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా లీలామోహన్ కృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. దేశం కోసం పోరాడిన మహనీయుల జీవిత చరిత్రలను తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజేయాలని సూచించారు. నేటి తరం చిన్నారులకు దేశ చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.సెల్ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, పిల్లల్లో దేశభక్తి, విజ్ఞానం, సామాజిక బాధ్యత పెంపొందించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ప్రజల మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగాలని ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్ర రాష్ట్ర విజయాన్ని ఎవరూ మరువకూడదని పేర్కొన్నారు.అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి ఎం. విజయలక్ష్మి, ఫౌండేషన్ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు.










