తమ్మినపట్నంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

తమ్మినపట్నం గ్రామములో వేంచేసియున్న శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు మార్చి 25 నుండి మార్చి 31 వరకు అత్యంత వైభవముగా జరుగును. శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ ఆవిష్కరిచారు. బ్రహ్మోత్సవాలు ఆహ్వానముకు పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ తానంకి నానాజీ, మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి మరియు గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు, చిల్లకూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు అహ్వానించే కార్యక్రమంలో ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, తిక్కవరం సర్పంచ్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్, కార్యనిర్వహణాధికారి వి.గిరికృష్ణ మరియు కమిటీ సభ్యులు భక్తాని రామయ్య, కొప్పాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam