సూళ్లూరుపేటలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల మెరుపు దాడులు – సీఐ మురళీకృష్ణ హెచ్చరిక

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని సీఐ మురళీకృష్ణ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి పలు లాడ్జిలపై మెరుపు దాడులు నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా అనైతిక కార్యకలాపాల్లో పాల్గొన్న పలువురు వ్యక్తులను, లాడ్జి యాజమాన్యాలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సూళ్లూరుపేట, తడ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, వారి ఆధార్ కార్డులు సేకరించి మాత్రమే గదులు కేటాయించాలని యాజమాన్యాలకు సూచించారు.

error: Content is protected !!
Prajaveek Shanam