ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన ధారా కృష్ణ ప్రసాద్, బచ్చల గాయత్రి
గూడూరు, అక్టోబర్ 28 (ప్రజా వీక్షణం ):
గూడూరు మండలం మేకనూరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. జడ్పీటీసీ అభ్యర్థి ధారా కృష్ణ ప్రసాద్, ఎంపీటీసీ అభ్యర్థి బచ్చల గాయత్రికి మద్దతుగా పార్టీ శ్రేణులు మంగళవారం విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల ఆదరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.మేకనూరు ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభించాలంటే టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు అవసరమని నాయకులు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ధారా కృష్ణ ప్రసాద్, బచ్చల గాయత్రిని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు రమేష్, అమర్నాథ్, నారాయణరెడ్డి, వెంకటకృష్ణారెడ్డితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.











