
పేరుకే సంస్థలు కాదు.. ప్రజలకు న్యాయం చేసే వ్యవస్థలు కావాలి: జాతీయ అధ్యక్షుడు ఈదురు పద్మాకర్
నెల్లూరు:
హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్ఆర్ఈసీఐ) ఆధ్వర్యంలో మూడో జాతీయ మానవ హక్కుల అవగాహన కార్యక్రమం నెల్లూరులో ఘనంగా జరిగింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు శ్రీ ఈదురు పద్మాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణ, మహిళలు, పిల్లలు, వృద్ధులు, బలహీన వర్గాల హక్కులపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఈదురు పద్మాకర్ మాట్లాడుతూ, మానవ హక్కులు ఎవరైనా ప్రసాదించే వరాలు కావని, ప్రతి మనిషి జన్మతోనే పొందే సహజ హక్కులని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించినప్పటికీ, నేటికీ అనేక మంది సామాన్యులు తమ ప్రాథమిక హక్కులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జాతి, మతం, కులం, భాష, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని పేర్కొన్న ఆయన, సమాజంలో ఇంకా అన్యాయం, వివక్ష, అణచివేత, దోపిడీ కొనసాగుతుండటం ఆందోళనకరమన్నారు. చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లే ఎంతోమంది న్యాయం పొందలేక మౌనంగా బాధలు భరిస్తున్నారని తెలిపారు.హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ కేవలం సమావేశాలు నిర్వహిస్తు, ప్రజలకు సంస్థ, సభ్యులకు అవగాహన కల్పిస్తూ బాధితులకు అండగా నిలబడే బాధ్యతాయుతమైన వేదికగా పనిచేస్తోందని చెప్పారు. అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికీ చట్టపరమైన మార్గదర్శకత్వం అందిస్తూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు.ఈ సందర్భంగా కొన్ని సంస్థల పనితీరుపై పరోక్షంగా స్పందించిన ఆయన, పేరుకే మానవ హక్కుల సంస్థలమని చెప్పుకుంటూ ఫొటోలు, సమావేశాలు, హోదాలకే పరిమితమయ్యే సంస్థలు సమాజానికి ఉపయోగపడవని అన్నారు. మానవ హక్కుల పేరుతో వ్యక్తిగత ప్రచారం, పదవుల ప్రదర్శన, సభ్యత్వాల వ్యాపారం చేయడం వల్ల అసలు లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు.”బాధితుడి కన్నీరు తుడవలేని సంస్థకు మానవ హక్కుల పేరును ఉపయోగించే నైతిక హక్కు ఉండదు. ప్రజల కోసం పనిచేసే సంస్థలే సమాజంలో గౌరవం పొందుతాయి. మానవ హక్కులు ప్రచారానికి కాదు… ప్రజలకు న్యాయం చేయడానికి.” అని ఈదురు పద్మాకర్ అన్నారు.హెచ్ఆర్ఈసీఐ కార్యకర్తలు గ్రామీణ స్థాయిలోకి వెళ్లి ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించాలని, మహిళలపై వేధింపులు, బాలల హక్కుల ఉల్లంఘనలు, వృద్ధుల సమస్యలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై జరిగే అన్యాయాలపై వెంటనే స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, అక్కడ హెచ్ఆర్ఈసీఐ తరఫున చట్టబద్ధంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని సభ్యులకు సూచించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మానవ హక్కులపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు.జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చివరగా నిర్వాహకులు అతిథులకు, పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేయజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు వై, ఈశ్వరావు, శివ కృష్ణ గారు సునీల్ గారు, అడివప్ప గారు సతీష్ గారు, రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ కమీషనర్ అఫ్ హెల్త్ &ఫ్యామిలీ వెల్ఫేర్ మంగళగిరి గుంటూరు డాక్టర్అనిల్ కుమార్ గారు, రాష్ట్ర కోల్డ్ స్టోర్ అధికారి కమీషనర్ అఫ్ హెల్త్ &ఫ్యామిలీ వెల్ఫేర్ మంగళగిరి గంటా దేవానంద్ గారు నెల్లూరు జిల్లా హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ నాయకులునెల్లూరు జిల్లా కన్వీనర్ ఎంట్రపాటి రమణయ్య ప్రెసిడెంట్ పాకాల వెంకట శ్రీనివాసరావు, చెర్మెన్ రామచంద్రారెడ్డి గారు వైస్ చైర్మన్ కళ్యాణగారు మరియి HRECI కమిటీ పాల్గొన్నారు













