శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రాపై భారీ ధర తగ్గింపు!

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ప్రజా వీక్షణం ప్రతినిధి): శాంసంగ్ కంపెనీ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా ధరను భారీగా తగ్గించింది. 12జీబీ ర్యామ్‌తో వచ్చిన రెండు వేరియంట్లపై రూ.15,000 వరకు ధర కోత విధించింది. కొత్త ధరలు శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
12జీబీ + 256జీబీ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.1,39,999 కాగా, ప్రస్తుతం రూ.1,24,999కే లభిస్తోంది. 12జీబీ + 512జీబీ వేరియంట్‌ ధర రూ.1,59,999 నుంచి రూ.1,44,999కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. దీంతో 256జీబీ వేరియంట్‌ను రూ.1,20,999కే పొందే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న భారత్‌లో విడుదలైన గెలాక్సీ ఎస్26 అల్ట్రాలో 6.9 అంగుళాల 120Hz డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్, 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. తాజా ధర తగ్గింపుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫోన్‌పై ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam