గూడూరు పట్టణం: ప్రజా వీక్షణం ప్రతినిధి
చిల్లకూరు మండలం బల్లవోలు పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దువ్వూరు కిరణ్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పార్టీ కార్యాలయంలో ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమక్షంలో దువ్వూరు కిరణ్‌రెడ్డి టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.









