22-10-2026-గురువారం
రాశిఫలాలు
మేషం
`ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.`
వృషభం
`చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.`
మిధునం
`ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మాతృ వర్గ బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.`
కర్కాటకం
`కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు.`
సింహం
`నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.`
కన్య
`నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత ఋణాలు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.`
తుల
`సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. వృత్తి,ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.`
వృశ్చికం
`ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరానికి చేతికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండటం మంచిది.`
ధనస్సు
`బంధు, మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధన వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.`
మకరం
`ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.`
కుంభం
`సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.`
మీనం
`నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.











