గూడూరులో మహిళా దినోత్సవం సందర్భంగా ధ్యాన–జ్ఞాన సత్సంగాలు

గూడూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులోని బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ధ్యాన–జ్ఞాన సత్సంగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సాధన ప్రాముఖ్యతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మహిళలతో పాటు పలువురు ధ్యాన సాధకులు పాల్గొన్నారు.సజ్జన సాంగత్యం కార్యక్రమంలో భాగంగా రామాభద్ర రెడ్డి, చెంగమ్మ బృందం తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రేవతి ఆత్మజ్ఞానం, సాధన విశిష్టత, అంతర్ముఖ ధ్యానం ప్రాముఖ్యతపై వివరణ ఇచ్చారు. మనలోని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎరుకతో జీవించడం ముఖ్యమని, ప్రతి ప్రశ్నకు సమాధానం మన అంతర్ముఖంలోనే ఉందని వివరించారు.సత్సంగంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సంధ్యా, లావణ్య, లత, అమ్ముదా తదితరులు ధ్యాన సాధన ద్వారా పొందిన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మహిళలతో పాటు పురుషులు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని చంద్రశేఖర్ మాస్టర్, గోపీనాథ్ మాస్టర్, నల్లస్వామి మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమం అనంతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వహణలో లీలావతి తదితరులు సహకరించారు.

Prajaveek Shanam