ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్‌కు పాస్టర్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్‌ను గూడూరు టౌన్ & రూరల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి నివాసంలో కలసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ దైవసేవకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి, ఆయురారోగ్యాలతో ప్రజానాయకుడిగా కొనసాగాలని దేవునిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. అలాగే గూడూరు ఎమ్మెల్యేకు రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్ & రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బక్కా రత్న శేఖర్, గౌరవ అధ్యక్షుడు డానియల్ రాజ్, ట్రెజరర్ కిషోర్ కుమార్, కమిటీ సభ్యులు జయరాజ్, ధన్యాసి విజయ్ కుమార్, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam