గూడూరు మండలంలో సర్వసభ్య సమావేశం – అభివృద్ధి పనులపై సమీక్ష


గూడూరు, ప్రతినిధి:
గూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ గురవయ్య పాల్గొని మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.మండల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గురవయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమయానికి అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
అలాగే గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Prajaveek Shanam