గూడూరులో ఉచిత కంటి వైద్య శిబిరం – పేదలకు సేవలో CRIWS ముందంజ

గూడూరు, ప్రతినిధి:
గూడూరు పట్టణంలోని మెయిన్ అంబేద్కర్ నగర్, హోసన్నా మందిరంలో పేద ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. చైత్ర రూరల్ ఇన్నోవేటివ్ వెల్ఫేర్ సొసైటీ (CRIWS) ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది.ఈ శిబిరంలో సభ్యులు అనూరూప్, ప్రవీణ్ కుమార్ మరియు కంటి పరీక్షకులు (ఆప్టోమెట్రిస్ట్) స్వప్న తదితరులు పాల్గొని ఆధునిక పరికరాలతో స్థానికులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి తగిన సలహాలు, సూచనలు అందించారు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి (LV Prasad Eye Hospital) సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో CRIWS స్వచ్ఛంద సంస్థ కీలక పాత్ర పోషించింది. సంస్థ డైరెక్టర్ యరమాల శ్రీనివాస్, కో-ఆర్డినేటర్ కనకాద్రి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలను సమీకరించి అవగాహన కల్పించి శిబిరానికి తీసుకువచ్చారు.శిబిరంలో మొత్తం 50 మందికి సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో కంటి చూపు సమస్యలు తీవ్రంగా ఉన్న 10 మందిని గుర్తించి ఉచిత కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల దృష్టి లోపాలను నివారించేందుకు CRIWS సంస్థ చేస్తున్న సేవలను స్థానికులు అభినందించారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్వాహకులు తెలిపారు.

Prajaveek Shanam