
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత రెడ్డి హాజరయ్యారు.
జిల్లా ఉపాధ్యక్షురాలు ఊటుకూరు యామిని రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకాని పూజిత రెడ్డిని గజమాలతో సన్మానించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి చట్టసభలు, శాసన మండలిలో అవకాశాలు కల్పించారని తెలిపారు. అలాగే అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు. మహిళలు ఈ విషయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కొడవలూరు భక్తవత్సల రెడ్డి, రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మైలా గౌరీ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సునంద, గూడూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శారదా, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు యామిని రెడ్డి, జిల్లా కార్యదర్శులు సుధాకర్ రెడ్డి, శంషాద్, అనిత, ప్రసన్న, మాధవి పాల్గొన్నారు. అలాగే గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు మండలాల మహిళా అధ్యక్షులు మరియు నియోజకవర్గంలోని మహిళా నాయకులు పాల్గొన్నారు.











